Mrunal Thakur Virat Kohli: విరాట్‌ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: విరాట్‌ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్‌

Published Fri, Sep 10 2021 10:44 AM | Last Updated on Fri, Sep 10 2021 2:43 PM

Mrunal Thakur Says She Was Madly In Love With Virat Kohli In Interview - Sakshi

భారతదేశంలో క్రికెటర్లకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ వారిని అభిమానిస్తుంటారు. కొందరు హీరోయిన్లు అయితే ఏకంగా క్రికెటర్లతోనే ప్రేమలో పడ్డ వాళ్లు ఉన్నారు. ఈ తరహాలోనే ఓ క్రికెటర్‌ని ప్రేమించినట్లు చెప్పకొచ్చింది బాలీవుడ్‌ నటి  మృణాళ్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఈ అమ్మడు క్రికెట్‌ నేపథ్యంలో హీందీలో రీమేక్‌ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 

ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో మృణాళ్‌.. తాను ఒక‌ప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించినట్లు చెప్పింది. తన సోదరుడికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని అలా తాను కూడా క్రికెట్‌ చూడటం, తర్వాత ఇష్టపడడం మొదలుపెట్టి..  ఆ క్రమంలో కోహ్లీ ఆట చూసి ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది ఈ ముద్దు గుమ్మ. దాదాపు ఐదేళ్ల క్రితం విరాట్‌తో కలిసి స్టేడియంలో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.

తాను ఆ రోజు నీలిరంగు జెర్సీ ధరించి టీమిండియా తరపు చీర్స్‌ చేసినట్లు అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది మృణాళ్‌. కట్ చేస్తే.. ప్రస్తుతం జెర్సీ లాంటి క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమాలో భాగం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న జెర్సీ దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానుంది. ఇది నాచురల్‌ స్టార్‌ నాని జెర్సీ మూవీ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే

చదవండి: Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement