![Shubman Gill breaks Shreyas Iyers record to become fastest player to reach 2500 ODI runs](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/shubman-gill1.jpg.webp?itok=h0RQdw0i)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీ సన్నహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో గిల్ దుమ్ములేపుతున్నాడు. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో సత్తాచాటిన గిల్.. ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో అద్బుతమైన శతకంతో మెరిశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు గిల్ మరోసారి అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే ఔటైనప్పటికి గిల్ మాత్రం కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ 92 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గిల్‌కు ఇది ఏడో వన్డే సెంచరీ కావడం విశేషం.
ప్రస్తుతం 104 పరుగులతో గిల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన గిల్..
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలు రాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ నిలిచాడు. గిల్ కేవలం 50 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది.
అయ్యర్ 59 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను సాధించాడు. తాజా మ్యాచ్‌తో అయ్యర్ అల్‌టైమ్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. అదే విధంగా 50వ వన్డే మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. కాగా శుబ్‌మన్ గిల్ ఇప్పటివరకు 50 వన్డేలు ఆడి 60.83 సగటుతో 2535 పరుగులు చేశాడు. అతడి ఇననింగ్స్‌లలో 7 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, 16 ఆర్ధశతకాలు ఉన్నాయి.
- Look at Rohit Sharma's reaction
- Look at the crowd's reaction
"They all know how aesthetically pleasing Shubman Gill is..."🔥💯
• The Most Talented Youngster Ever
pic.twitter.com/UUJS2Ot6Vw— Gillfied⁷ (@Was_gill) February 12, 2025
వన్డేల్లో అత్యంతవేగంగా 2500 పరుగులు చేసిన భారత ప్లేయర్లు వీరే..
శుబ్‌మన్ గిల్- 50 ఇన్నింగ్స్‌లు
శ్రేయాస్ అయ్యర్- 59 ఇన్నింగ్స్‌లు
శిఖర్ ధావన్ -59 ఇన్నింగ్స్‌లు
కేఎల్ రాహుల్-63 ఇన్నింగ్స్‌లు
విరాట్ కోహ్లీ/నవ్‌జోత్ సిద్ధూ- 64 ఇన్నింగ్స్‌లు
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment