World Table Tennis ontender Tourney: ముగిసిన శ్రీజ పోరాటం  | World Table Tennis Doha Contender Tourney: Akula Sreeja Quotes In Second Round | Sakshi
Sakshi News home page

World Table Tennis ontender Tourney: ముగిసిన శ్రీజ పోరాటం 

Published Thu, Jan 11 2024 7:30 AM | Last Updated on Thu, Jan 11 2024 7:30 AM

World Table Tennis Doha Contender Tourney: Akula Sreeja Quotes In Second Round - Sakshi

దోహా: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ దోహా కంటెండర్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన శ్రీజ రెండో రౌండ్‌లో 14–12, 11–8, 11–7తో ఆద్రీ జరీఫ్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచింది.

అయితే మూడో రౌండ్‌లో శ్రీజ 5–11, 10–12, 9–11తో చెన్‌ జు యు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో శ్రీజ–యశస్విని ద్వయం 6–11, 7–11, 5–11తో జియాన్‌ టియాని–చెన్‌ జింగ్‌టాన్‌ (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement