సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పచ్చ మీడియా మైండ్‌గేమ్ ప్రారంభించి గందరగోళం సృష్టిస్తోందని నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు ఓ చానల్ దుష్ప్రచారం చేస్తోందని, పచ్చ మీడియా దిగజారుడుతనానికి ఇదే నిదర్శనమని అన్నారు. తమ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన ఇంటికి రావడం పెద్ద తప్పుగా, అదేదో నేరమైనట్లు ఆ చానల్ చూపించిందని అన్నారు.
ఇది పచ్చమీడియా నీచ సంస్కృతికి పరాకాష్ట అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ తనకు సముచిత స్థానం ఇచ్చి నెల్లూరు ఎంపీని చేసిందని, అలాగే పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి తన గౌరవాన్ని పెంచిందని తెలిపారు. అలాంటి పార్టీని వదిలి పోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధితో మరోసారి టీడీపీకి ఓటమి తప్పదని భావించి పచ్చమీడియా మైండ్‌గేమ్ ఆడుతోందని అన్నారు. వారి వక్రీకరణ రాతలు చూసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన చెందవనే విషయాన్ని పచ్చమీడియా గుర్తుంచుకోవాలని హితవుపలికారు.
Comments
Please login to add a commentAdd a comment