దివ్యాంగ క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆంఽధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, డిఫరెంట్లీ ఏబుల్ట్ క్రికెట్ కమిటీ, డిఫరెంట్ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో నూతన దివ్యాంగ క్రికెటర్లు ఈనెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోహర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 97055 43294, 77801 67625 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
కండలేరులో
56.700 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 56.700 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరుకు వరద కాలువ ద్వారా 700, సోమశిల జలాశయం నుంచి 1,100 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. అలాగే కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 160, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment