గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
కావలి: కావలి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి గంజాయితోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కావలి డీఎస్పీ పి.శ్రీధర్ స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెద్దపవని రోడ్డులో ఉన్న విక్రమ సింహపురి పీజీ కళాశాల వద్ద నివసించే షేక్ మస్తానమ్మ, షేక్ గౌస్ బాషా, వైకుంఠపురానికి చెందిన షేక్ మీరాబీ, లింగసముద్రం మండలం అన్నెబోయినపల్లికి చెందిన దగ్గు చిన్న అబ్బయ్య, ప్రకాశం జిల్లా అత్తయింటివారిపాళెం ఉరఫ్ నేకునాంపురం గ్రామానికి చెందిన కారంశెట్టి సుధాకర్, పొన్నలూరు మండలం మాలెపాడు గ్రామానికి చెందిన షేక్ గౌస్‌బాషా, షేక్ రసూల్‌బీ, తూర్పుగోదావరి జిల్లా దారకొండ గ్రామానికి చెందిన మరో వ్యక్తి ముఠాగా ఏర్పడి గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. విక్రమ సింహపురి పీజీ కళాశాల వద్ద నలుగురిని అరెస్ట్ చేసి 1.180 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వైకుంఠపురం రైల్వే బ్రిడ్జి వద్ద ముగ్గురిని పట్టుకుని 1.350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించారు. గంజాయి సరఫరా చేసే దారకొండకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు.
గౌరవరం టోల్‌ప్లాజా వద్ద..
కావలి మండలం గౌరవరం గ్రామం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం కావలి రూరల్ పోలీసులు పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి బెంగళూరుకు లారీలో గంజాయిని తీసుకెళ్తున్న వేలు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment