చందన, సీఎంఆర్ ఎక్స్‌ప్రెస్ సేల్ డ్రా విజేత హనీఫా
నెల్లూరు(బారకాసు): క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా చందన, సీఎంఆర్‌లు ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ సేల్ క్రిస్మస్ బంపర్ డ్రాలో పడుగుపాడుకు చెందిన హనీఫా విజేతగా నిలిచింది. ఆదివారం నగరంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ అజీజ్ హాజరై డ్రా తీశారు. అనంతరం విజేతకు కారును బహూకరించారు. అలాగే గత వారంలో తీసిన డ్రాలో నాలుగో మైలుకు చెందిన వై.సుజాతకు టీవీఎస్ స్కూటీని అందజేశారు. వీక్లీ డ్రాల విజేతలైన 35 మందికి గ్రైండర్, మిక్సీ, ఎలక్ట్రికల్ కుక్కర్, డిన్నర్ సెట్ తదితరాలను ఇచ్చారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ చందన, సీఎంఆర్ సంస్థలు తక్కువ లాభాపేక్షతో నాణ్యమైన వస్త్రాలు, అభరణాలు విక్రయించడమే కాకుండా వారికి వచ్చే ఆదాయంలో వినియోగదారులకు కారు, స్కూటీ, గృహోపకరణాలు అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు. అంతేకాకుండా అనేకమందికి ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, చందన అధినేత మావూరి శ్రీనివాసరావు, ఎం.వెంకటగణేష్, మోపూరు పెంచలయ్య, శైలేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment