నిషేధిత యాంటీ బయోటిక్స్ వాడితే చర్యలు
నెల్లూరు(సెంట్రల్): నిషేధిత యాంటీ బయోటిక్స్‌ను ఆక్వా సాగులో వినియోగిస్తే కఠిన చర్యలు చేపడతామని జేసీ కార్తీక్ పేర్కొన్నారు. యాంటీ బయోటిక్స్ వినియోగాన్ని అరికట్టేందుకు సంబంధించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నగరంలోని కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాంటీ బయోటిక్స్‌ను రొయ్యల సాగులో వినియోగిస్తుండటంతో ఎగుమతులు వెనక్కొస్తున్నాయని చెప్పారు. వినియోగించిన వారిపై చట్టం మేరకు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. రొయ్యల మేత, రసాయనాలు, మందులను విక్రయించే షాపులు, తయారు చేసే ప్రాంతాల్లో తనిఖీలను తరచూ చేపట్టాలని ఆదేశించారు. నిషేధిత యాంటీ బయోటిక్స్‌ను వినియోగించే వారి లైసెన్స్‌లను రద్దు చేయాలన్నారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రతి నెలా సమావేశాన్ని నిర్వహించి నివేదికలను అందజేయాలని చెప్పారు. జిల్లా స్థాయి కమిటీ కన్వీనర్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, డ్రగ్స్ కంట్రోల్ అధికారి వీరకుమార్‌రెడ్డి, ఫుడ్ కంట్రోల్ ఏడీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment