వరికి బీమా ప్రీమియాన్ని చెల్లించాలి
నెల్లూరు(సెంట్రల్): వరి పైరుకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15వ తేదీ చివరి గడువుగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరికి హెక్టార్‌కు రూ.420 చెల్లించి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.
జీపీగా శ్రీహరినారాయణరావు
నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది చుండూరి శ్రీహరినారాయణరావును గవర్నమెంట్ ప్లీడర్ (జీపీ) గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన జిల్లా కోర్టులో ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ కేసులను వాదిస్తారు. మూడేళ్ల పాటు ఈయన పదవిలో కొనసాగుతారు. 30 సంవత్సరాల నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఈయన నియామకం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
10న హాకీ
జట్ల ఎంపికలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ బాలబాలికల మహిళా హాకీ జిల్లా జట్లను ఈ నెల 10వ తేదీన ఎంపిక చేయనున్నామని అసోసియేషన్ కార్యదర్శి జగన్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఎంపికలకు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో హాజరుకావాలని కోరారు. ఎంపికై న క్రీడాకారులు వివిధ జిల్లాల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని చెప్పారు. వివరాలకు 94404 66189 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
టీజీపీ ప్రత్యేక కలెక్టర్‌గా శీనానాయక్
నెల్లూరు(అర్బన్): ఆత్మకూరులో తెలుగుగంగ భూసేకరణ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న కె.శీనానాయక్‌ను ప్రభుత్వం మంగళవారం తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా శీనానాయక్ నెల్లూరులోని టీజీపీ స్పెషల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని ఆత్మకూరు భూసేకరణ విభాగానికి డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.
పరిమితికి మించి
పొగాకు సాగు వద్దు
● వేలం నిర్వహణాధికారి రాజశేఖర్
మర్రిపాడు: డీసీపల్లి వేలం కేంద్రంలో పరిధిలో ఇచ్చిన పరిమితి కన్నా ఎక్కువ పొగాకు పంటను రైతులు వేసి ఉన్నారని, దీని వల్ల నష్టపోయే ప్రమాదం అధికంగా ఉందని వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా పొగాకు పంటలో లాభాలు రావడంతో ప్రపంచమంతా సాగు అధికమైందన్నారు. మన రాష్ట్రంలోనూ పంటను ఇప్పటికే చాలా అధికంగా వేశారని డిమాండ్ కన్నా అధికంగా పండించడం వల్ల ఆశించిన ధరలు ఉండకపోవచ్చునన్నారు. ఇకనైనా పొగాకు నాట్లను వేయకుంటే మంచిదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment