అధికారులకు నెలవారీ మామూళ్లు!
పట్టపగలు నది నుంచి
లోడ్‌తో వెళ్తున్న టిప్పర్
ఇసుక మాఫియాకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండటంతో మైనింగ్, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుని ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహన యజమానులు మాత్రం వాహనానికి రూ.12 వేలు చొప్పున పోలీస్ స్టేషన్లకు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పీకేపాడు ఇసుక రీచ్ నుంచి భారీ వాహనాలు ఇసుక తరలిస్తుండటంతో ఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారిపై గోతులు ఏర్పడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, పర్యావరణం దెబ్బతింటుందని, రోడ్లు ధ్వంసమవుతున్నాయని పడమటి కంభంపాడు గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఇటీవల గ్రామస్తులే రీచ్ వద్దకు వెళ్లి ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. అయితే, అధికారులు వచ్చి ఇసుకాసురులకు కొమ్ము కాశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment