మంత్రి నారాయణకు భయపడేది లేదు
నెల్లూరు(అర్బన్): ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి నారాయణ బెదిరిస్తే తాను భయపడేది లేదు. నారాయణ తన విద్యాసంస్థలు, ఆస్పత్రి ఎలా ఎదిగాయో గుర్తు తెచ్చుకోవాలి. ఇతర సంస్థలను తొక్కుకుంటూ.. ఎలాంటి చర్యల ద్వారా ఎదిగాడో ప్రజలకు తెలుసు’ అంటూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన నగరంలో ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నారాయణకు చిత్తశుద్ధి ఉంటే నగరాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాజకీయ కక్షలు ఆపాలన్నారు. పొలిటికల్‌గా నారాయణ ఏమి చేసినా ఎదుర్కొంటా. నెల్లూరు సిటీలోని ప్రజలకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. నారాయణ అధికార దర్పంతో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉన్న తనపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. తనకాలంలోనే కోవిడ్ సమయంలో వేలాది మందికి భోజనాలు అందించామన్నారు. రెడ్‌క్రాస్‌లో తలసేమియా రోగుల కోసం 20 పడకల క్లినిక్‌ను నిర్మిస్తున్నామన్నారు. తాను వైఎస్సార్సీపీలో ఉన్నాననే ఆక్రోశంతో రెడ్‌క్రాస్ చైర్మన్‌గా ఉండరాదంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. 20 రోజుల్లో రాజీనామా చేస్తానని చెబితే కలెక్టర్ కూడా సరే అన్నారని, ఈ కొద్దిరోజులు కూడా ఆగలేక మంత్రి ఓఎస్‌డీ తమ కమిటీ మెంబర్లకు ఫోన్ చేసి చైర్మన్ పదవి తీసేందుకు స్కోప్ ఉందా.. మొత్తం కమిటీని రద్దు చేసేందుకు ఏమి చేయాలో తెలుసంటూ బెదిరించడం దారుణమన్నారు. విమర్శలకు తావు ఇవ్వకూడదనే తాను జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించారు. మంత్రి నారాయణ ఆస్పత్రిలో కేన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు రెడ్‌క్రాస్ కేన్సర్ ఆస్పత్రిని ఏమి చేయదలచుకున్నారో చెప్పాలని కోరారు. తాను రాజీనామా చేసినప్పటికీ ఒక సభ్యుడిగా రెడ్‌క్రాస్‌లో సేవా కార్యక్రమాలు నిరంతరంగా సాగేందుకు కృషి చేస్తానన్నారు.
పొలిటికల్‌గా దేనినైనా ఎదుర్కొంటా
కార్యకర్తలకు అండగా ఉంటా
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment