ఏపీ హరిత హోటల్లో తనిఖీలు
నెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ నెల్లూరులోని ఏపీ హరిత హోటల్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆరునెలలుగా రూమ్ ఆక్యుపెన్సీ గురించి ఆరాతీశారు. పలు లోపాలను ఆయన గుర్తించారు. ముఖ్యంగా ఆక్యుపెన్సీ రేటు 40 శాతం కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నారు. అలాగే ఆధునికీకరణ పనులు వేగంగా జరగకోవడం, సిబ్బంది నిర్లక్ష్యం, హోటల్ నిర్వహణలో లోపాలున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది పనితీరును మెరుగుపడాలన్నారు.
బాలల ఆశ్రమానికి సేవా పురస్కారం
అల్లూరు: హిమాచల్‌ప్రదేశ్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎంఎన్ రావ్, డాక్టర్ షాలినీరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పర్గాంకర్ ఫౌండేషన్ ఏటా అందజేసే ఉత్తమ సేవా పురస్కారానికి మండలంలోని నార్త్ ఆములూరులో ఉన్న బాలల ఆశ్రమం ఎంపికై ంది. ఫౌండేషన్ ప్రతినిధులైన తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పీఆర్ అండ్ ఆర్‌డీ స్పెషల్ కౌన్సిల్ ఎంఎస్‌ఆర్ మూర్తితోపాటు నెల్లూరు వెంకటేశ్వర స్వామి గురు నిలయం ఆర్గనైజర్ ఎం.గోపీచంద్, ఏపీఎస్‌ఎఫ్‌సీ లీగల్ అడ్వైజర్ జి.మోహన్‌రావు ఆదివారం ఆశ్రమానికి విచ్చేసి చైర్మన్ రామచంద్ర శరత్‌బాబుకు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆదరణ కరువైన పిల్లలు చెడు మార్గం పట్టకుండా వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు ఆశ్రమం కృషి చేస్తోందని అభినందించారు. శరత్‌బాబు మాట్లాడుతూ పురస్కారం కింద అందజేసిన రూ.5 లక్షలను బాలుర పాఠశాలలో ల్యాబ్ ఏర్పాటుకు వినియోగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment