మనుబోలు: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సైదాపురం మండలం గంగదేవిపల్లికి చెందిన పాములూరు సుబ్బయ్య (36) తన స్నేహితుడితో కలిసి కాగితాలపూరు క్రాస్‌రోడ్డు వద్ద గల ధాబాకు వెళ్లారు. తిరిగెళ్లే క్రమంలో హైవే దాటుతుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై శివరాకేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుమందు తీసుకొస్తూ...
విడవలూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని రామతీర్థం సమీపంలోని గాజులమ్మ గుడి వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఊటుకూరు కంచరపాళెం దళితవాడకు చెందిన గరికపాటి భాస్కర్ (55) అనే వ్యక్తి తన వరి పొలానికి పురుగు మందు కొనుగోలు కోసం ఆదివారం సాయంత్రం రామతీర్థం గ్రామానికి వెళ్లాడు. తిరిగొస్తుండగా రామతీర్థం శివారులోని గాజులమ్మ గుడి వద్ద గుర్తుతెలియని బొలెరో వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో భాస్కర్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment