క్రీడలపై ఆసక్తి చూపాలి
● వీఎస్‌యూ ఇన్‌చార్జి వీసీ
విజయభాస్కరరావు
వెంకటాచలం: విద్యార్థులు చదువుతోపాటుగా, క్రీడలపై ఆసక్తి చూపాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) ఇన్‌చార్జి వీసీ విజయభాస్కరరావు పిలుపునిచ్చారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో జరుగుతున్న సెంట్రల్ జోన్ అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. కావలి జట్టు విజేతగా, వీఎస్‌యూ కళాశాల జట్టు రెండో స్థానంలో నిలిచింది. వారికి ఇన్‌చార్జి వీసీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోసాల్లాసాన్ని కలిగిస్తాయని తెలియజేశారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. త్వరలో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో జరగబోయే అంతర్ విశ్వ విద్యాలయాల క్రికెట్ టోర్నమెంట్‌లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, పీడీ డాక్టర్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment