ఈఏ అసోసియేషన్ కార్యవర్గ ఏర్పాటు
నెల్లూరు(పొగతోట): సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గుంజి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఎస్.రాజశేఖర్, అసోసి యేట్ ప్రెసిడెంట్‌గా పల్లవరం హరికృష్ణ, కోశాధికారిగా దాక్షాయణి, మరో 15 మంది కార్యవర్గసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆదివారం నెల్లూరులోని యూటీఎఫ్ భవనంలో ఎన్నికల ప్రక్రియ జరగ్గా అధికారులుగా కిరణ్, సూర్యతేజ వ్యవహరించారు. 311 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమిటీ మూడు సంవత్సరాలపాటు పదవీ కాలంలో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment