తమ్ముళ్ల మధ్య మద్యం చిచ్చు
ఉదయగిరి: మండలంలోని గండిపాళెంలో ఈ నెల 11న ఏర్పాటు చేసిన మద్యం దుకాణంపై రాజకీయ రగడ నడుస్తోంది. వాస్తవానికి మండలానికి మంజూరైన మూడు మద్యం దుకాణాలను ఉదయగిరి పట్ణణంలో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఓ షాపులో విక్రయాలు చాలా తక్కువగా ఉండటంలో, గండిపాళెంలో ఏర్పాటు చేసేందుకు యత్నించారు. దీన్ని గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ వర్గం వ్యతిరేకించగా, మరో వర్గం మాత్రం ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో దుకాణం ఇటీవల వెలిసింది. దీంతో షాపును మూసేయాలంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. ఆయన సూచనల మేరకు షాపును ఎకై ్సజ్ అధికారులు తాత్కాలికంగా మూయించారు. దీంతో ఎమ్మెల్యే వద్ద రెండు వర్గాలు పంచాయితీ పెట్టి నిర్ణయం తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మొత్తమ్మీద మద్యం దుకాణ వ్యవహారం అధికార పార్టీలో రాజకీయ రచ్చ రేపింది.
వైన్ షాపు తెచ్చిన తంటా
తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం
ఎమ్మెల్యే వద్ద పంచాయితీ
Comments
Please login to add a commentAdd a comment