దగదర్తి (బిట్రగుంట): దగదర్తి మండలం నారాయణపురంలోని తన మిరపతోటను అదే గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ధ్వంసం చేశారని దేవరపల్లి చంటి మంగళవారం దగదర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనపై కక్ష కట్టి, తన అరెకరా పొలంలో సాగు చేసిన మిరప పంటను టీడీపీ నేతలు గ్రద్దగుంట శీనయ్య, గ్రద్దగుంట నవీన్, మారుబోయిన వేణుగోపాల్, శింబోతుల కిరణ్, మాధవరావు, సుధాకర్, రాధాకృష్ణ మంగళవారం వేకువన ధ్వంసం చేశారన్నారు. తన భూమిని బలవంతంగా లాక్కోవాలనే దురుద్దేశంతోనే కొద్ది రోజులుగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మొక్కలు నాటిన రోజు నుంచే తనను బెదిరిస్తున్నారని, మంగళవారం తెల్లవారుజామున మొక్కలు పీకేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment