వెంకటాచలం: మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీలో నలగర్ల వెంకరమణయ్య అనే వ్యక్తిపై గురువారం పిచ్చికుక్క దాడి చేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను వెంటనే నెల్లూరుకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పంచాయతీ పరిధిలోని గొట్లపాళెం, మంగళంపాడు, కండ్రిగ దళితవాడలో కొన్నిరోజుల వ్యవధిలో పిచ్చికుక్కుల దాడిలో పదిమందికి పైగా గాయపడ్డారు. గొట్లపాళేనికి చెందిన పచ్చబట్ల రత్నయ్య (70) అనే వృద్ధుడు పిచ్చికుక్కల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల క్రితం మృతిచెందాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment