ఆదిలక్ష్మీదేవికి వనమహోత్సవం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆదిలక్ష్మీదేవి అమ్మవారికి గురువారం శ్రీవారి నందనవనంలో వనమహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి తర్వాత వచ్చే ముక్కనుమ నాడు వనమహోత్సవం నిర్వహించడం ఈ క్షేత్రం ఆచారమని దేవస్థాన ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి తెలిపారు. ఆదిలక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం నందనవనం (తోట)లోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, ఆస్థాన సేవ నిర్వహించారు. అమ్మవారి పూజ, ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment