ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసుల నమోదు
● రూ.14.22 లక్షల జరిమానా
నెల్లూరు(టౌన్): సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై జిల్లా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జాతీయ రహదారిపై వారం రోజులుగా తనిఖీలు చేసి అధిక చార్జీల వసూలు, పర్మిట్ లేకపోవడం, త్రైసిక పన్ను చెల్లించకపోవడం తదితర వాటికి సంబంధించి బస్సులపై 84 కేసులు నమోదు చేశారు. రూ.14.22 లక్షలు అపరాధరుసుము విధించారు. మరో నాలుగు రోజులపాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి డీటీసీ సిరిచందన గురువారం తెలిపారు. తనిఖీల్లో ఎంవీఐలు బాలమురళీకృష్ణ, కార్తీక్, రఫీ, ఏఎంవీఐలు పూర్ణచంద్రరాబు, స్వప్నీల్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
తనిఖీల్లో పాల్గొన్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment