లింగ నిర్ధారణ నేరం
ఆత్మకూరు: గర్భస్థ శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం నిర్దేశించిన పరీక్షలను కొందరు దుర్వినియోగం చేస్తూ లింగ నిర్ధారణ చేసి ఆ విషయాలను వెల్లడించడం నేరమని ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రితో పాటు పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలను శనివారం నిర్వహించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.పది వేల జరిమానాను విధించడంతో పాటు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలోని స్కానింగ్ కేంద్రంతో పాటు ఐసీటీసీ, టీబీ యూనిట్లను పరిశీలించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శేషారత్నం, ఆర్‌ఎంఓ ఉషాసుందరి, డాక్టర్లు మేకపాటి దీప్తి, అరుణ, హారిక, శ్రావణ్‌కుమార్, వెంకటేశ్వరరావు, ఎంపీహెచ్‌ఈఓ సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment