బాలభవిత కేంద్రం ద్వారా ఆపరేషన్లు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఆవరణలో ఉన్న బాలభవిత కేంద్రం ద్వారా వివిధ రకాల లోపాలు ఉన్న పిల్లలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ వి.సుజాత తెలిపారు. శనివారం బాలభవిత కేంద్రంలో పుట్టుకతో గుండె సంబంధిత లోపాలున్న పలువురు చిన్నారులకు చైన్నె అపోలో ఆస్పత్రి సౌజన్యంతో ప్రత్యేక వైద్యశిబిరం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే గ్రహణమొర్రి, గ్రహణ శూల, గుండె, నేత్ర, వినికిడి లోపం తదితర పలురకాల వ్యాధులతో పాటు సకాలంలో నడవలేని, మాటలు రాని పిల్లలకు ఇక్కడ స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా ఉచిత వైద్యసేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారన్నారు. అత్యంత ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంట్ వంటి చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైస్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేష్‌బాబు, బాలభవిత కో–ఆర్డినేటర్ డాక్టర్ యశ్వంత్, సెంటర్ మేనేజర్ జమీర్, పీపీయూనిట్ ఎంఓ వెంకటేశ్వర్లు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
అనంతరం ఎన్‌ఆర్‌సీని డీఎంహెచ్‌ఓ సుజాత పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment