25 నుంచి అంతర్జాతీయ కాయిన్స్ ఎక్స్‌పో
నెల్లూరు సిటీ: అంతర్జాతీయ కాయిన్స్ ఎక్స్‌పోను తమ పాఠశాలలో ఈ నెల 25, 26న నిర్వహించనున్నామని సద్గురు సిల్వర్ ఓక్స్ సీబీఎస్‌ఈ స్కూల్ డైరెక్టర్ షణ్ముకాచారి, వెంకటాద్రినాయుడు పేర్కొన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ముత్తుకూరు రోడ్డులోని పార్థసారథినగర్‌లో గల పాఠశాలలో శనివారం ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. విజయవాడలోని శ్రీధర్ సీసీఈ సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 30 దేశాలకు చెందిన వివిధ రకాల కరెన్సీ, పురాతన నాణేలు, ప్రపంచంలోని అతి పెద్ద, అతి చిన్న నోట్లతో పాటు స్టాంపులు తదితరాలను ప్రదర్శించనున్నామని చెప్పారు. ఆసక్తి గల పాఠశాలల యాజమాన్యాలు ముందుగా తమను సంప్రదిస్తే టైమ్ స్లాట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. దాదాపు 25 వేల మంది తిలకించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని, వివరాలకు 91827 28726, 98661 50354 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రిన్సిపల్ సుధాకర్‌రావు, అడ్మిస్ ప్రిన్సిపల్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment