ఆకట్టుకున్న కాయిన్స్ ఎక్స్‌పో
నెల్లూరు సిటీ: నెల్లూరు పార్థసారథినగర్‌లోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కాయిన్స్ ఎక్స్‌పోను కలెక్టర్ ఆనంద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజుల కాలం నాటి నాణేలు, నోట్లు, స్టాంపులు, వాటి విశిష్టతను తెలియజేసేలా కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని అభినందించారు. 20 దేశాల నోట్లు, కాయిన్స్‌ను ప్రదర్శించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఔత్సాహికులు సందర్శించారు. కాగా కార్యక్రమాన్ని ఆదివారం సైతం నిర్వహించనున్నారు. ఆర్‌ఐఓ శ్రీనివాసులు, అపుస్మా డైరెక్టర్ శ్రీధర్, శ్రీధర్స్ సీసీఈ సుధీర్, పాఠశాల డైరెక్టర్లు షణ్ముఖ ఆచారి, వెంకటాద్రి, సుధాకర్, గౌరి తదితరులు పాల్గొన్నారు. ///
Comments
Please login to add a commentAdd a comment