ఎల్సీడీసీ సర్వే తనిఖీ
నెల్లూరు(అర్బన్): జిల్లాలో నిర్వహిస్తున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్(ఎల్సీడీసీ) సర్వేను ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ శనివారం తనిఖీ చేశారు. నగరంలోని జేవీఆర్ కాలనీలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. సమీప ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సర్వేను పర్యవేక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. శరీరంపై ఎలాంటి మచ్చలున్నా వైద్య సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. చర్మ సంబంధిత మచ్చలైతే వాటికి మందులిస్తామని తెలిపారు. లెప్రసీ అనుమానిత కేసులొస్తే వారికి ప్రత్యేక చికిత్సలు చేసి వ్యాధి ఉందో లేదో నిర్ధారిస్తామని వివరించారు. డీఆర్టీబీ కో ఆర్డినేటర్ శ్రావణ్‌కుమార్, వైద్యాధికారి సాయిసింధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment