అనంతపురం: ‘అమ్మా... నన్ను క్షమించు. నా ఆరోగ్యం బాగోలేదు. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. నాకు మొలల నొప్పి ఎక్కువగా ఉంది. భరించలేకున్నా. అందుకే చనిపోవాలని అనుకున్నా. నీవు అమ్ములు దగ్గరకు పోయి ఉండు. అమ్ములూ అమ్మ జాగ్రత్త. నువ్వు పిల్లలు జాగ్రత్త. నన్ను క్షమించండి.’ అంటూ తన తల్లికి లేఖ రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయవిదారకమైన ఈ ఘటన గుత్తిలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాలు... గుత్తిలోని కటికి వీధికి చెందిన కేఎం కిరణ్‌కుమార్ (42) కొంత కాలంగా మొలల సమస్యతో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. నొప్పి తీవ్రత భరించలేక జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన.. సోమవారం తన తల్లికి లేఖ రాసి గుత్తి జీఆర్పీ పరిధిలోని తురకపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment