కేఎస్‌ఎన్ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో మూడో సెమిస్టర్ ఫలితాలను సోమవారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేసీ సత్యలత విడుదల చేశారు. మొత్తం 438 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 390 మంది (89.04 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బీఏ (ఆనర్స్)లో 85 మందికి గాను 78 మంది, బీకామ్ (ఆనర్స్)లో 124 మందికి గాను 118 మంది, బీఎస్సీ (ఆనర్స్)లో 229 మందికి గాను 194 మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను బుధవారం కళాశాల వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. రీవాల్యూయేషన్, పర్సనల్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో పేపర్‌కు రూ. 300 చెల్లించాల్సి ఉంటుందన్నారు.
కళాశాల టాపర్లు వీరే..
బోయ సృజన (కెమిస్ట్రీ) 9.15 గ్రేడ్ పాయింట్లతో కళాశాల టాపర్‌గా నిలిచింది. అలాగే కవితాకర్ సుష్మ (మ్యాథమెటిక్స్) 9.08 పాయింట్లు, సంపంగి చందన (మ్యాథమెటిక్స్) 9.06 పాయింట్లు సాధించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరిని ప్రిన్సిపాల్‌తో పాటు వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ హెచ్. శివశంకర్, అధ్యాపకులు రామాంజనేయులు, రామలింగారెడ్డి, షఫీ, రామకృష్ణ, అంజనరెడ్డి, రేణుక, తిమ్మారెడ్డి, ఆదినారాయణ, రమణనాయుడు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment