సంతబొమ్మాళి: మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొర వ వల్లనే పోర్టు నిర్మాణం సాధ్యమైందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన శనివారం పోర్టును సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రభుత్వమూ చేయ ని రీతిలో సీఎం వైఎస్ జగన్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేశారని అన్నారు. పోర్టు సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు 1.5 కిలోమీటర్లు, నార్త్ బ్రేకింగ్ వాటర్ పనులు 560 మీటర్లు పనులు జరిగాయని, అలాగే బర్త్, ఇతర పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇదంతా శంకుస్థాపన చేసిన ఆరునెలల్లోనే జరిగందన్నారు. వలసల మీదే ఆధారపడిన జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు. జనవరిలో పోర్టు డ్రెడ్జింగ్ పను లు మొదలైన మూడు నెలల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే అనుబంధ పరిశ్రమలు వచ్చి జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు. యువకులు, సామాన్య ప్రజలు, పోర్టు కు వచ్చి అభివృద్ధి చూడాలని కోరారు. స్కూళ్ల యాజమాన్యాలు ఇక్కడ విహార యాత్రలు నిర్వహించి పోర్టు నిర్మాణంపై పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి చూడాలన్నారు. పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని మన అందరికీ గర్వకారణమని, భోగాపురం ఎయిర్‌పోర్టు, మూల పేట పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంద న్నారు. ఈ నెల 15వ తేదీన పలాసలో జరిగే సీఎం పర్యటనకు అంతా రావాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త దువ్వాడ వాణి, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమల్, జెడ్పీటీసీ పాల వసంతరెడ్డి, స్థానిక సర్పంచ్ జె.బాబురావు తదితరులు ఉన్నారు.
సీఎం వైఎస్ జగన్ చొరవ వల్లే పోర్టు నిర్మాణం
యువకులు, విద్యార్థులు పోర్టు నిర్మాణం చూసేందుకు రావాలి
మంత్రి సీదిరి అప్పలరాజు
Comments
Please login to add a commentAdd a comment