అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆల య ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఏర్పాట్లు చేయగా, అంతరాలయంలో స్వామి వారి దర్శనం అందరికీ జరిగేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు చర్యలు చేపట్టారు. తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్. హరీష్ కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకున్నారు. తొలిసారిగా అరసవల్లి క్షేత్రానికి రావడంతో వీరికి ఈఓ హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ప్రత్యేకంగా స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం హరీష్ దంపతులు ప్రత్యేకంగా సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. ఈయన వెంట ఆల య పాలకమండలి సభ్యులు ఎన్.కోటేశ్వర చౌదరి, ఆర్డీవో రంగయ్య, సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు తదితరులున్నారు. అలాగే సెంట్రల్ రైల్వే ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్‌ఐఎస్) ప్రధానాధికారి గంధం సత్యకుమార్ కూడా స్వామిని దర్శించుకోగా అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ. 68,300, విరాళాల ద్వారా రూ.95,300, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1,80 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment