వ్యక్తి ఆత్మహత్య
నరసన్నపేట: మండలంలోని బొరిగివలస సుబ్బారావు కాలనీలో నివాసముంటున్న గంగరాపు వేణుగోపాలం (35) మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొరిగివలసకు చెందిన ధనలక్ష్మితో శ్రీకాళహస్తికి చెందిన గంగరాపు వేణుగోపాలంతో వివాహమైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహం. శ్రీకాళహస్తిలో కొన్నాళ్లు కాపురం చేశారు. ఇటీవల ధనలక్ష్మి అక్కడ ఘర్షణ పడి కన్నవారింటికి వచ్చేసింది. కొద్ది రోజుల తరువాత వేణుగోపాలం కూడా ధనలక్ష్మి వద్దకు వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ ఆదివారం ధనలక్ష్మి ఇంట్లో లేని సమయంలో వేణుగోపాలం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధనలక్ష్మి ఇంటికి వచ్చే సరికి వేణుగోపాలం వేలాడుతుండటంతో ఇరుగు పొరుగు వారికి పిలిచింది. వారు వచ్చి చూససరికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ, సిబ్బంది పరిశీలించారు. మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేకాట శిబిరంపై దాడి
రణస్థలం: మండలంలోని చిన్న పిషిణి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 15 మందిని జె.ఆర్.పురం పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.33,480 నగదు, 15 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోని పేకాట, కోడిపందేలు, బెట్టింగ్‌లు, గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment