ప్రీమియం రైతులే చెల్లించాలి..
పంటల బీమా ప్రీమియం చెల్లింపుల విధానంలో ప్రభు త్వం మార్పు చేసింది. రైతుల వాటా మొత్తాన్ని ఇక నుంచి రైతులే చెల్లించాలి. అప్పుడే వారికి బీమా వర్తిస్తుంది. జిల్లా వ్యాప్తంగా రైతులు గమనించాలి. బ్యాంకు సిబ్బంది కొంత చొరవ చూపాలి. రుణం పొందిన వారితో బీమా ప్రీమియం కట్టించాలి. నాన్ లోన్ రైతులకు అవగాహన కలిగించాలి.
–సూర్యకిరణ్, లీడ్ బ్యాంకు మేనేజర్
ప్రభుత్వమే చెల్లించాలి..
వరితో పాటు ఇతర పంటలకు బీమా ప్రీమియం వాటా రైతులే చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయం. ఇది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అన్నదాతలకు ఆర్థిక భారమే అవుతుంది. గత ప్రభుత్వంలా రైతులపై భారం పడకుండా కూటమి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలి.
– కోట జోగినాయుడు, రైతు, కామేశ్వరిపేట,
నరసన్నపేట మండలం
●
Comments
Please login to add a commentAdd a comment