తోలాపి ఘటనపై జెడ్పీ సీఈఓ విచారణ
పొందూరు: మండలంలోని తోలాపి గ్రామ సచివాలయంలో వీఆర్‌వో ఎం.దివాకర్(రేవతిరావు)పై దాడి చేసి కార్యాలయంలో కంప్యూటర్లు ధ్వంసం చేసిన ఘటనపై జెడ్పీ సీఈవో శ్రీధర్‌రాజా గురువా రం విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ఎం.మన్మధరావు ఇప్పటికే విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. దీనిపై సంతృప్తి చెందని కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణ జరపాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలో వీఆర్‌వో, సచివాలయ సిబ్బంది సమక్షంలో విచారణ చేపట్టా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ విచార ణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. తహశీల్దార్ వెంకటేష్ రామానుజులు, ఎంపీడీవో మన్మధరావు, సచివాలయం కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment