ఎలాంటి సాయం అందలేదు
గత ప్రభుత్వంలో రైతు భరోసా, పంట నష్టం బీమా, పొలం వద్దకే వచ్చి పంట కొనుగోలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. నాకు మహంతిపాలెంలో రెండు ఎకరాల ముప్పై సెంట్లు భూమి ఉంది. నిత్యం సాగుబడిలోనే ఉంటుంది. ఇప్పటి వరకు కుటమి ప్రభుత్వంలో ఎలాంటి సాయం అందలే దు. చంద్రబాబు సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన రూ. 20వేలు వెంటనే అందించి ఆదుకోవాలి. – గొర్లె అప్పలనాయుడు,
మహంతిపాలెం గ్రామం, రణస్థలం మండలం
ఎదురుచూస్తున్నాం..
మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. తల్లికి వందనం కింద రూ.30 వేలు వస్తుందని ఎదురుస్తున్నాం. ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికీ ఏడాదికి రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆరు నెలలు దాటుతున్నా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. – దేవి పట్నాయక్, పాతపట్నం
పెట్టుబడి సాయమేదీ..?
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు పెట్టుబడి సాయం ఇంతవరకు విడుదల చేయలేదు. అన్నదాత సుఖీభవ నిధులను రైతు ఖాతాలకు జమ చేయాలి. చాలా మంది రైతులు ఈ నిధులు వస్తా యని సాగు పెట్టుబడి కోసం అప్పులు చేసుకున్నారు. – కప్పల యుగంధర్, రైతు,
కేసరపడ గ్రామం, కంచిలి మండలం
Comments
Please login to add a commentAdd a comment