శ్రీకాకుళం
దొంగనోట్ల ముఠా ఆటకట్టుదొంగనోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. –8లో
శనివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
భారీ ర్యాలీగా వెళ్తున్న రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు
వైఎస్సార్ సీపీ హయాంలో రైతు భరోసా కింద రూ.13,500 ఠంచనుగా సాయం అందించేవాళ్లం. ఆ సాయాన్ని రూ.20వేలు చేస్తానని చెప్పి చంద్రబాబు వంచన చేశారు. ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారు. 2019కి ముందు పంటల బీమాను రైతుల చేత కట్టించేవారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉచిత పంటల బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే కట్టి ఆదుకుంది. రైతును మోసం చేశారు కాబ ట్టే మేం రోడ్డెక్కాం. అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు అప్పులు గుర్తుకువచ్చాయా. అప్పుల విషయంలోనూ ఇలాగే దు ష్ప్రచారం చేశారు. ఆరు నెలల్లోనే ధరలతో బాదేస్తున్నారు. గ్యాస్ డబ్బులు పడకపోతే ఎవరిని అడగాలో కూడా ప్రజలకు తెలీడం లేదు. రాష్ట్రంలో సాక్షి, ఇతర జర్నలిస్టులపై దాడులు హేయం. రాష్ట్రం అప్రకటిత ఎమర్జెనీలో ఉందా..? ప్రభుత్వాలు నడిపే వారు ప్రజల కోసం పనిచేయాలి తప్ప కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవడానికి కాదు. ఎన్నికల ముందు సూక్తులు చెప్పి.. ఇప్పుడు కబుర్లు చెప్పడం చంద్రబాబుకు సరికాదు. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయి. మెడికల్ కాలేజీలు, పోర్టులు ప్రైవేటుపరం చేసేస్తున్నారు.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
చంద్రబాబుది వంచన..
Comments
Please login to add a commentAdd a comment