అక్షరంపై దాడి సిగ్గు చేటు
శ్రీకాకుళం పాతబస్టాండ్/ శ్రీకాకుళం పీఎన్‌కాలనీ:
అక్షరంపై దాడులు సిగ్గు చేటని పాత్రికేయు లు ధ్వజమెత్తారు. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతి, కడప జిల్లాల్లో కవరేజ్‌కి వెళ్లిన సాక్షి టీవీ కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై మూకుమ్మడిగా దాడిచేసి గాయాలపాలు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయాలే తప్ప ప్రశ్నించేవారిపై కూటమి ప్రభుత్వ పైశాచికత్వంగా వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. పాత్రికేయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వినతి పత్రం ఇచ్చినవారిలో పాత్రికేయులు టి.సునీల్, బగాది అప్పలనాయు డు, వి.సన్యాసినాయుడు, వి.సత్యనాయుడు, సీహెచ్ శ్రీను, ఎ.రామకృష్ణ, కెమెరామెన్ రాజు, కె.జయశంకర్, పైడి బాలకృష్ణ, మొదలవలస వాసు, రాజేష్, సూరిబాబు, కె.శంకర్, సింగ్, సీహెచ్ రాము, హరికృష్ణ, నిరంజన్, నాయుడు, సంతోష్‌లతో పాటు అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
టెక్కలి: సాక్షి మీడియా ప్రతినిధులపై దాడి చేసి న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం టెక్కలి ప్రెస్‌క్లబ్ సభ్యులంతా ఆర్డీఓ ఎం. కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను కవరేజ్ చేసేందుకు వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములపై కొంత మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విన్నవించా రు. వినతిపత్రం అందజేసిన వారిలో టెక్కలి ప్రెస్‌క్లబ్ సభ్యులు ఎల్.వెంకటరమణ, డి.భాస్క ర్, డి.భాను, కె.రామారావు, టి.తిరుపతిరావు, ఎస్.ప్రవీణ్, జి.రాంబాబు, టి.ప్రసాద్ రెడ్డి, పి.అభి, డి.గౌరీశంకర్‌రెడ్డి, బి.ఈశ్వర్, ఎస్.బాబ్జి, డి.సుధాకర్, హరినాథ్‌రెడ్డి, జె.హరి, రాంబాబు, ఈశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
దాడిని ఖండించిన స్సామ్నా
శ్రీకాకుళం: రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని చిన్న, మధ్యతరహా వార్తా పత్రికల సంఘం (స్సామ్నా) ఆందోళ న వ్యక్తం చేసింది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో సాక్షి మీడియా బృందంపై జరిగి న దాడిని ఖండిస్తూ, ఇలాంటి విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారా వు, సీహెచ్ రమణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment