నేడే జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్ శనివారం జరగనుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ జిల్లా మొత్తం మీద 19 బెంచీలు నిర్వహించామని, దీన్ని జిల్లాలో గల ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే లీగల్ సర్వీసులను ప్రజల వద్దకు చేరేలా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్స్ వారిని, పారా లీగల్ వలంటీర్స్‌ను నియమించి వారికి బ్యాడ్జెస్ ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment