ఉపాధి పనులు కల్పించాలని వినతి
ఇచ్ఛాపురం రూరల్: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చామని, ఫీల్డ్ అసిస్టెంట్ అనపాన షర్మిళ అవకతవకలపై ఫిర్యాదుచేశామన్న అక్కసుతో తమకు రెండు వారాల నుంచి ఉపాధి పనులు కల్పించడం లేదంటూ మశాఖపురం గ్రామానికి చెందిన వేతనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు పనులు కల్పించాలని కోరుతూ నలభై మంది ఉపాధి వేతనదారులు సంతకాలు చేసి శుక్రవారం జిల్లా కలెక్టర్, ఉపాధి పీడీ కార్యాలయాల్లో ఎంపీపీ బోర పుష్పతో కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ ఉప సర్పంచ్ చెబితేనే ఉపాధి పనులు ఇస్తానంటూ ఫీల్డ్ అసిస్టెంట్ కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని, తమకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment