రైతన్న గుండె ఘోషకు వైఎస్సార్ సీపీ గొంతుకనిచ్చింది. అన్
ప్లకార్డులతో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి (చిత్రంలో) జెడ్పీచైర్‌పర్సన్ పిరియా విజయ, ఎంవీ పద్మావతి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్:
కూటమి ప్రభుత్వం అన్నదాతకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీసీ ధ్వజమెత్తింది. కోతలు కూడా అయిపోతున్నా అన్నదాత సుఖీభవ కింద సాయం అందజేయకపోవడంపై మండిపడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు అన్ని దశల్లోనూ అండగా నిలిచామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భా గంగా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వరకు ఏర్పాటుచేసిన ర్యాలీలో పాల్గొని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందించారు. ముందుగా పొన్నాడ వంతెన వద్ద మహాత్మా జ్యోతీరావు పూలే పార్కు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అక్కడి నుంచి ర్యాలీగా ఎడ్లబళ్లపై వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలంతా కలిసి జేసీకి వినతి పత్రం అందించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, తూర్పుకాపు, కాళింగకుల, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ సత్యన్నారాయణ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, పొన్నాడ రుషి, ఎన్ని ధనుంజయరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రౌతు శంకరరావు, సాధు వైకుంఠరావు, కరి మి రాజేశ్వరరావు, ధర్మాన రామలింగంనాయుడు, గొండు కృష్ణ, గొండు రఘురాం, గేదెల పురుషోత్తం, అంబటి శ్రీనివాసరావు, చింతా డ వరుణ్, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నర్తు నరేంద్రయాదవ్, కడియాల ప్రకాష్, చిట్టి జనార్ధనరావు, ఖండాపు గోవిందరావు, అంధవరపు రమేష్, అల్లు లక్ష్మినారాయణ, పీస గోపి, టి.కామేశ్వరి, మూకళ్ల తాతబాబు, వైవీ దివ్యశ్రీధర్, యజ్జల గురుమూర్తి, మార్పు పృథ్వీ, పిన్నింటి సాయి, రొక్కం బాలకృష్ణ, సనపల నారాయణరావు, దన్నా రామినాయుడు, పైడి శ్రీనివాసరావు, బూర్లె శ్రీనివాసరావు, బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పప్పల రమేష్, కోట గోవిందరా వు, ఎంఏ బేగ్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్, మండ వల్లి రవి, భైరి మురళి, కర్నేన హరి, సీపాన రామారావు, బోర బుజ్జి, శ్రీరామ్మూర్తి, జోగారావు, జె.జయరాం, రాజాపు అప్పన్న, తులసీదాస్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ ధ్వజం
ప్రభుత్వ తీరుకు నిరసనగా
జిల్లా కేంద్రంలో రైతు ర్యాలీ
వేలాదిగా తరలివచ్చిన అన్నదాతలు
ఇప్పుడు అప్పులు గుర్తుకు వచ్చాయా:
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు: మాజీ మంత్రి సీదిరి
రైతులకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని జేసీకి వినతి పత్రం అందజేత
పోరాటమే అజెండా
అన్నదాతలకు రూ.20వేలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పి మోసం చేశారు. సూపర్ సిక్స్‌పేరిట వాగ్దానాలు ఇచ్చి మర్చిపోయారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా అయినా రైతులకు చిన్న సాయం కూడా చేయలేకపోయారు. చెరకు రైతులకు సైతం పెట్టుబడులు పెరిగాయి, కూలీ చార్జీలు పెరిగాయి కాబట్టి చెరకుకి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. ధాన్యం కొనుగోలులోనూ రకరకాల కొర్రీలు పెడుతున్నారు. దళారులు రైతులను దోచుకుంటున్నా చర్యలు తీసుకోవడం లేదు. పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు అందించి అన్ని రకాలుగా ప్రభుత్వమే సాయం అందించాలి. ప్రజలకు పథకాలు అందించాల్సి వచ్చినప్పుడే ప్రభుత్వానికి అప్పులు గుర్తుకువస్తాయా. ముందు తెలీదా..?
– ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment