నరసన్నపేట: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16న మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ పి.లత, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు. 19 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు నిరుద్యోగ యువత (పురుషులు) కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో చేరుకోవాలని సూచించారు. ఉద్యోగ మేళాలో హెటిరో, భారత ఫైనాన్సియల్ లిమిటెడ్, విరాట్ మోడీ సోలార్ సిటీ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్ నుంచి బీటెక్, డిప్లమా వంటి విద్యార్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చని తెలిపారు.
16న ఎస్సీ ఉప వర్గీకరణ
కమిషన్ పర్యటన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ (రిటైర్డ్) ఈనెల 16న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. కమిషన్ చైర్మన్ 16న ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని, 11 గంటల నుంచి 2 గంటల వరకు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు. తర్వాత దళిత కులాలకు చెందిన ఉద్యోగులు, కులసంఘ నాయకులు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment