అరసవల్లి: ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిద్దామని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎంవి.గోపాలరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సంస్కరణల ముసుగులో ప్రభుత్వ ఆధీనంలో విద్యుత్ శాఖను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం తగదన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆందోళనకు దిగిన విద్యుత్ కార్మికులపై ఎస్మా విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ రెండు రాష్ట్రాల కార్మికులకు సంఘీభావంగా మన రాష్ట్రంలో కూడా విద్యుత్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ను డీబీటీ విధానంలో ఇస్తా మని చెబుతూ ప్రైవేటీకరణకు దారులు తెరుస్తున్నారని..ఈ విధానంపై తామంతా నిరసనలు ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జి.రమేష్‌కుమార్, సభ్యులు జె.సురేష్‌కుమార్, గురునాథరావు, లోకేశ్వరరావు, సూర్యనారాయణ, రాజారావు, టి.వి.సుబ్రహమణ్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment