కారు నడిపింది రాజేషట..?
● ఎమ్మెల్యే తనయుడి కారు ఢీ కొన్న ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
● ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/పాతపట్నం: పాతపట్నం మండలం కొరసవాడలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడి కారు ఆటోను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన భామిని మండలం లివిరి గ్రామానికి చెందిన చెప్పల బోగయ్య(50) శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు. బోగయ్య కుమారుడు మధు ఇచ్చిన స్టేట్‌మెట్ ఆధారంగా.. పోలీసులు ఆ కారును పల్లి రాజేష్ అనే వ్యక్తి డ్రైవ్ చేశాడని కేసు నమోదు చేశారు. దీంతో ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేసింది ఎమ్మెల్యే కుమారుడు సాయి గణేషా? ఇంకొకరా?అన్న తర్జనభర్జనలకు తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment