గోదాముల సామర్థ్యం పెంపే లక్ష్యం
పొందూరు: రాష్ట్రంలో స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల సామర్థ్యం పెంపు కోసం నూతన గోదాముల నిర్మాణం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర గిడ్డంగులు, గోదాముల సంస్థ ఎండీ జి.సురేష్‌కుమార్ అన్నారు. స్థానిక స్టేట్ వేర్‌హౌస్ గోదాములను శుక్రవారం పరిశీలించారు. నూతన గోదాముల నిర్మాణానికి, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. ఆయనతో శ్రీకాకుళం రీజనల్ మేనేజర్ రాజశ్రీ, పొందూరు మేనేజర్ సునీత, అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment