శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మార్కెట్ విలువ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న సందర్భంగా ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18వ తేదీన డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో సలహాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. ఈ నెల 24వ తేదీన వాటిని పరిశీలించి వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం 25వ తేదీన రివిజిన్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇస్తుందని తెలిపారు. ఈ నెల 27వ తేదీన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలుచేయడం జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment