బడి రుణం తీర్చుకుంటూ..
సైకిల్ షెడ్ ప్రారంభోత్సవంలో సినీ నటుడు సుమన్‌తో దాము
శ్రీకాకుళం కల్చరల్: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామంలో జన్మించిన దాము గేదెల చదువు నేర్పిన బడి రుణం తీర్చుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న దాము స్వగ్రామమైన కత్తుల కవిటి గ్రామానికి విద్యపరంగా ఎన్నో సేవలను అందిస్తున్నారు. దాము స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసి అమెరికా వెళ్లి సెటిలయ్యారు. అనంతరం స్వగ్రామానికి, సొంత బడికి మేలు చేయడం ప్రారంభించారు.
● తాను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటుగా అక్కడి విద్యార్థులు బాగా చదువుకునేందుకు ప్రోత్సాహంగా యూనిఫామ్స్, స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నారు.
● జిల్లా పరిషత్ హైస్కూల్ నిర్మాణం, విస్తరణ కోసం తనవంతు చేయూత అందించారు. అప్పట్లో రూ.10లక్షలు విలువ చేసే స్థలం, అందులో 5 గదుల నిర్మాణానికి అవసరమైన నిధులు అందించారు.
● ఇటీవలే 2022లో ఆ స్కూల్‌లో ఉపాధ్యాయుల కోసం ఒక సైకిల్ స్టాండ్‌ను నిర్మించారు.
● ఊరిలో వైద్యపరంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, ఆపరేషన్లు కూడా చేయించారు.
● పేదలకు అన్నదానం, నిరంతర మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు
సేవలోనే ఆనందం
విద్యతోనే అభివృద్ధి ఉంటుంది. అందుకే విద్య కోసం ఎంతైనా సేవ చేస్తాను. అలాగే సాంస్కృతిక రంగం కోసం, ఆధ్యాత్మిక రంగంలోనూ నా వంతు సేవలు అందిస్తున్నాను.
– దాము గేదెల, న్యూజెర్సీ
Comments
Please login to add a commentAdd a comment