పెద్ద పండగ సందర్భంగా మద్యం ప్రియులు మత్తులో మునిగి తేలారు. 13వ తేదీ భోగి, 14వ తేదీ సంక్రాంతి, 15వ తేదీ కనుమ, 16వ తేదీ ముక్కనుమ రోజుల్లో విపరీతంగా మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నాలుగు రోజుల్లో రూ. 17.78 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు జరిగాయి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి వంటి ప్రాంతాల్లో మద్యం ఎక్కువగా అమ్ముడు పోయింది. ప్రైవేట్ మద్యం షాపులు ముందస్తుగా డిమాండ్ ఊహించి కావాల్సిన మద్యాన్ని అందుబాటులో ఉంచారు. ఎచ్చెర్లలోని బేవరేజెస్ కార్పొరేషన్ గోదాంలో సైతం కావాల్సిన మద్యంను సరఫరాకు అందుబాటులో ఉంచారు. పండగ నాడు ప్రభు త్వం కూడా ప్రజారోగ్యంపై కాకుండా ఆదాయంపైనే దృష్టి పెట్టింది. ఫలితంగా ఎక్కడికక్కడ బెల్టుషాపులు వెలిశాయి. మద్యం షాపులు నిబంధనలు మేరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించాలి. బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటలు వరకు నిర్వహించాలి. కానీ పండగ సమయం
పండగ సందర్భంగా
రౌండ్ ది క్లాక్ మద్యం విక్రయాలు
ఎక్కడికక్కడ వెలసిన బెల్టు షాపులు
Comments
Please login to add a commentAdd a comment