దివ్యాంగులను ప్రోత్సహిద్దాం: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల్లో సృజనాత్మకత వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్ పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకొని ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. స్వాభిమాన్ కార్యక్రమంలో డీపీఓ కె.భారతీసౌజన్య, జిల్లా ఉపాధి కల్పనాధికారిణి సుధా, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.నగేష్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.సూర్య కిరణ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment