ముద్దాయిలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి
గార: జైళ్లలో కుల ఆధారిత వివక్ష సంఘటనలపై అంచనా వేసేందుకు జిల్లా అధికారులు శుక్రవారం జిల్లాజైలును సందర్శించారు. అంపోలు పరిధిలోని జిల్లా జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, పలు శాఖల అధికారులు సందర్శించారు. జైలులోని పరిసరాలను పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులపై కల్పనపై దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అన్ని అంశాల వారీగా తనిఖీలు చేశారు. మహిళా బ్యారెక్‌లో మహిళా ఖైదీలతో వారి వసతులపై ఆరా తీశారు. జైల్లో తాగునీరు, వైద్యంపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి టీవీ బాలమురళీకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుమల చైతన్య, సంక్షేమశాఖాధికారి వై.విశ్వమోహన్, ఎంప్లాయిమెంట్ అధికారి కె.సుధ, జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాధ స్వామి, జిల్లా పరిశ్రమలశాఖాధికారి జె.ఉమామహేశ్వరరావు, జైలు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment