యువకుడు ఆత్మహత్య
నందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లికు చెందిన గోరు ఖగేశ్వరరావు(22) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతామరాపల్లికి చెందిన చేనేత కార్మికుడు గోరు వెంకటరమణ, కుమారి దంపతులకు కుమారుడు ఖగేశ్వరరావు, కుమార్తె ఉన్నారు. ఖగేశ్వరరావు డిగ్రీ వరకు చదివాడు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. డిగ్రీ చదివినా ఏ పనీ చేయలేకపోతున్నానని ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలో ఆదివారం తండ్రి పని కోసం బయటకు వెళ్లగా.. తల్లి కన్నవారింటికి కంట్రగడ వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖగేశ్వరరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీధిలో అటుగా వెళ్తున్నవారు గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెచ్‌సీ జీవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని బాలుడికి గాయాలు
రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలో ఆరేళ్ల బాలుడు జిడ్డు కుమార్‌నాయుడు ఆడుతుండగా రోడ్డుపైకి రావడంతో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment