వైద్యసేవలు అంతేనా?
ఆస్పత్రుల్లోని వైద్యులు గ్రామాల్లో పరిశీలనకు వెళ్లడం వల్ల ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు హాస్పిటల్స్‌లో వైద్య సేవలు అంతంత మాత్రంగా అందుతాయని రోగులు ఆందోళన చెందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో 60 మంది డాక్టర్లు ఉండగా వీరిలో 11 మంది పరిశీలనకు వెళుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోనుంది. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి లబ్ధిదారుల ఏరివేత లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పునఃపరిశీలన ప్రక్రియ పూర్తయ్యే వరకు సదరం ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ సైతం నిలిచిపోయింది. దీంతో సదరం ద్వారా ధ్రువపత్రాలు పొంది పింఛన్ అందుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎంతోమంది దివ్యాంగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీల్లు చల్లింది. కొత్తగా పింఛన్లు పొందే ఆవకాశం లేకుండాపోయింది. మరో వైపు ఏరివేత ప్రక్రియ ప్రారంభం కావటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment