రిమ్స్‌లో రికార్డు స్థాయిలో ఓపీ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్యశాలకు సోమవారం రికార్డుస్థాయిలో అవుట్ షేషెంట్లు వచ్చారు. సోమవారం 958 మంది రోగులు చికిత్సల కోసం రావడంతో రిమ్స్ ఆవరణ కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటలతో ఓపీ రిజిస్ట్రేషన్ ముగియాల్సి ఉండగా సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగించారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వైద్యులు యథావిధిగా మధ్యాహ్నమే వెళ్లిపోగా స్థానిక వైద్యులు సాయంత్రం 6.30 గంటల వరకు ఓపీ చూశారు. పలువురికి రక్తపరీక్షలు, స్కానింగ్‌కు సిఫార్స్ చేయడంతో వారు మంగళవారం మళ్లీ రిమ్స్‌కు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
51 మంది దివ్యాంగులకు సదరంలో పరీక్షలు
పింఛన్ పొందుతున్న 51 మంది దివ్యాంగులకు రిమ్స్ వైద్యులు సదరంలో పునఃపరీక్షలు నిర్వహించారు. మండలస్థాయికి వెళ్లి పునఃపరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ చెవి, కళ్లు, మానసిక వైకల్యం కలిగిన వారిని పరీక్షించేందుకు యంత్రాలు అవసరమని, వాటిని మండల స్థాయికి తరలించే అవకాశం ఉండదని, రిమ్స్ వైద్యులు రాష్ట్ర స్థాయికి నివేదించడంతో వారిని రిమ్స్‌కు పిలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆదివారం రాత్రి ఈ మూడు విభాగాలకు చెందిన దివ్యాంగులను రిమ్స్‌కు రావాలని సమాచారం అందించారు. ఎముక విభాగానికి సంబంధించిన వైద్యులు మండల స్థాయికి వెళ్లి పరీక్షలు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment